విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు
– ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి
– విద్యార్థులకు అండగా బీసీ సంఘం ఉద్యమాలు
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో పేద విద్యార్థులు భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దని, ఫీజు రిజయంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు.

మంగళవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్ మెంట్ పై ఆధారపడి విద్యార్థులు చదువుకుంటున్నారని అన్నారు. అదే ఫీజు రియంబర్స్ మెంట్ తో కళాశాల యజమాన్యాలు కాలేజీలను నడిపిస్తున్నారని అన్నారు. ఏండ్లుగా బకాయిలు పెండింగ్ లో ఉంచడంతో విద్యార్థులు చదువులు కొనసాగించలేకపోతున్నారని అన్నారు. కాలేజీలలో ల్యాబ్ లు, హాస్టళ్లు, లైబ్రరీలు సక్రమంగా నిర్వహించలేక విద్యా ప్రమాణాలు పాటించడం లేదన్నారు.
kvcs
రాష్ట్ర వ్యాప్తంగా రూ.900 కోట్లు ఫీజు రియంబర్స్ మెంట్ పెండింగ్లో ఉంచడంతో 14 లక్షల మంది విద్యార్దుల భవిష్యత్తు ప్రమాదకరంగా మారిందన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడం విచారకరం అని అన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయకపోవడంతో ది ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అయ్యర్ ఇన్సిట్యూట్ నవంబర్ 3వ విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చిన విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయకపోతే విద్యార్థులకు అండగా బీసీ జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

రేపు జిల్లా కలెక్టరేట్ ముట్టడి