చేవేళ్ల ఘటనలో 20 మంది మృతి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

చేవేళ్ల ఘటనలో 20 మంది మృతి
– 15 మందిని కాపాడిన పోలీసులు, స్థానికులు
– మృతుల్లో ఓ చిన్నారి కూడా
– కొనసాగుతున్న సహాయక చర్యలు
చేవేళ్ల, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల సమీపంలో జరిగిన కంకర టిప్పర్, ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య తేలింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్లు తెలిసింది.

తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దానికింద కూరుకుపోయారు. మొత్తం 20 మంది మృతి చెందగా… మృతుల్లో 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది.
kvcs
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు హైదరాబాద్‌లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం. సహాయక చర్యలు జరుగుతున్న సమయంలో చేవెళ్ల సీఐ భూపాల్‌ శ్రీధర్‌పైకి జేసీబీ ఎక్కడంతో ఆయన ఎడమ కాలికి గాయమైంది. సీఐను చేవెళ్ల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఇదికూడా చదవండి…

టిప్పర్‌ లారీ, ఆర్టీసీ బస్సు డీ