మహేందర్ రెడ్డితో వీఎన్ గౌడ్ భేటీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మహేందర్ రెడ్డితో వీఎన్ గౌడ్ భేటీ..!
– జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డికి శుభాకాంక్షలు
– త్వరలో తిరిగి సొంత గూటికి చేరుకొనున్న నేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని, హ్యాట్రిక్ జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డిని తాండూరు సీనియర్ నాయకులు, మునిసిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ కలిశారు. సోమవారం విశ్వనాథ్ గౌడ్ తో పాటు ఆయన కుమారుడు సోమనాథ్ గౌడ్, రైతు నాయకులు మల్రెడ్డిపల్లి సుభాన్ రెడ్డిలు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డిలు త్వరలో కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరుతున్న సందర్భంగా ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డిల వెంట ఉంటామని అన్నారు. మరోవైపు మున్సిపల్ మాజీ చైర్మన్ గౌడ్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో విశ్వనాథ్ గౌడ్ బేటి కావడం పట్ల తాండూరు రాజకీయాల్లో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే వారు తిరిగి సొంత పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

 

ఇదికూడా చదవండి…