అందరు రక్తదానం చేయాలి
– తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్
– ఆర్యవైశ్య, మార్వాడి యువమంచ్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ అన్నారు. ప్రతి యేడాది మాదిరిగానే తాండూరు ఆర్యవైశ్య యువజన సంఘం, అఖిల భారత మార్వాడి యువమంచ్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని పట్టణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆదివారం తాండూరు డీఎస్పీ కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శేఖర్ గౌడ్ జెండా ఊపీ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి యేడాది ఆర్యవైశ్య యువజన సంఘం, మార్వాడి యువంచ్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సోమవారం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో అందరు పాల్గొని రక్తదానం చె యాలని పిలుపునిచ్చారు. అనంతరం సంఘాల ప్రతినిధులు రక్తదానం ప్రాధాన్యత వివరిస్తూ ప్లకార్డులు, నినాదాలతో ర్యాలీ కొనసాగించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, ఆయా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

