ఐదు మంది పేకాటరాయుళ్లపై కేసు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఐదు మంది పేకాటరాయుళ్లపై కేసు
– రూ.5వేలు, పేకాట ముక్కలు స్వాదీనం
– వెల్లడించిన యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేకాట ఆడుతున్న 5 మందిపై కేసు నమోదు చేసినట్లు యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

శుక్రవారం రాత్రి 11గంటల సమయంలో యాలాల మండలం పగిడిపల్లిలో పిల్లికండ్ల రాములు, అప్తగిరి పవన్ కుమార్, ఎర్ర పకిరప్ప, కొండి వెంకటేష్, కొండి ఏసులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందింది.
kvcs
ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకుని.. వారి వద్ద నుంచి రూ. 5వేల నగదు, పేకాట ముక్కలను సీజ్ చేయడం జరిగిందని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఎవరైనా పేకాట ఆడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

చలికాలంలో వెచ్చని సేవ..!