అంద‌రి ఆరాధ్యుడు అంబేద్క‌ర్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అంద‌రి ఆరాధ్యుడు అంబేద్క‌ర్..!
– ఆయ‌న స్పూర్తితో సీఎం కేసీఆర్ ప‌రిపాల‌న
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– నియోజ‌క‌వ‌ర్గంలో అంబేద్క‌ర్‌కు ఘ‌న నివాళులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: రాజ్యాంగ నిర్మాణ దాత‌, భార‌తర‌త్న డా.బీఆర్ అంబేద్క‌ర్ అంద‌రి ఆరాధ్యుడ‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అభివ‌ర్ణించారు. గురువారం అంబేద్క‌ర్ 131వ జ‌యంతి సంద‌ర్భంగా తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని కోట్‌ప‌ల్లి, పెద్దేముల్, తాండూరు మండ‌లం, తాండూరు ప‌ట్ట‌ణంలో నిర్వ‌హించిన కార్య‌క్రమాల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొని అంబేద్క‌ర్‌కు ఘ‌న నివాళులు అర్పించారు.
తాండూరు ప‌ట్ట‌ణంలో అంబేద్క‌ర్ యువ‌జ‌న సంఘం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన వేడుక‌ల్లో పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొని నాయ‌కుల‌ను, యువ‌కుల‌ను ఉత్తేజ ప‌రిచారు. తాండూరు మండ‌లం అంతారం, తాండూరు ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ చౌర‌స్తా, పాత తాండూరు అంబేద్క‌ర్ పార్కు, తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంతో పాటు త‌దిత‌ర ప్రాంతాల్లోని అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఆశాజ్యోతి డా.బీఆర్ అంబేద్క‌ర్ ఒక‌వ‌ర్గానికి మాత్ర‌మే దేవుడు కాద‌ని, అంద‌రికి ఆరాధ్యుడుని అన్నారు. ఆయ‌న‌ ర‌చించిన రాజ్యాంగ స్పూర్తితో తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ సంక్షేమ‌, అభివృద్ధి పాల‌న అందిస్తున్నార‌ని అన్నారు. అంబేద్క‌ర్ ఆయ‌న సాధ‌నతో అంద‌రు ముందుకు సాగాల‌న్నారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్, మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల న‌ర్సింలు, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం), మార్కెట్ క‌మిటి వైస్ చైర్మ‌న్ వెంక‌ట్ రెడ్డి, నాయ‌కులు ప‌ట్లోళ్ల న‌ర్సింలు, శ్రీ‌నివాస్ చారి, రాజుగౌడ్, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం. శ్రీ‌నివాస్, ఉపాధ్య‌క్షులు హ‌రిగౌడ్, కౌన్సిల‌ర్లు, దేవాల‌యాల చైర్మ‌న్లు, అనుంబంధ సంఘాల అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.