ఆరోగ్యానికి గ్యారంటీ.. అల్లం టీ..!

ఆరోగ్యం జాతీయం తాండూరు తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

ఆరోగ్యానికి గ్యారంటీ.. అల్లం టీ..!
– చలికాలంలో తీసుకుంటే అద్భుత ఫలితాలు
– బ్లడ్ ఫ్రెషర్‌ను ఎలా కాపాడుతుంతో తెలుసా
దర్శిని డెస్క్ : చలికాలంలో అనేక వ్యాధులు చుట్టుముడతాయి. వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు చాల మంది ఆరోగ్య చిట్కాలను పాటిస్తుంటారు. ఈ చలికాలంలో అల్లం టీ తాగితే.. ఆరోగ్యానికి గ్యారెంటీ ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక కప్ అల్లం టీ తాగితే, ఫ్లూ, జలుబు రిస్క్ 30% తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అల్లంలోని విటమిన్ C, మెగ్నీషియం రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

అల్లంలో జింజరాల్స్, షోగాల్స్ అనే కాంపౌండ్లు యాంటీ-ఆక్సిడెంట్స్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్‌ ఉంటాయి. అల్లం టీ రోజూ తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అల్లం శరీరంలో వేడిని పెంచడమే కాదు, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అల్లం టీలోని జింజరాల్స్ గొంతు నొప్పి, దగ్గును తగ్గించి, శ్వాసకోశ సమస్యలను అరికడతాయి. అల్లం యాంటీ-మైక్రోబయల్ ప్రాపర్టీస్‌తో బాక్టీరియా, వైరస్‌లను చంపుతుంది. అల్లం జీర్ణరసాలను పెంచి, గ్యాస్‌ను తగ్గిస్తుంది. ఉబ్బరం, వికారాన్ని తగ్గిస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్‌ను వేగవంతం చేస్తుంది. చలికాలంలో హెవీగా ఉండే ఆహారం జీర్ణం చేయడానికి సహాయపడుతుంది.

చలికాలంలో రక్తనాళాల్లో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అల్లం రక్త ప్రసరణను మెరుగుపరచి, ఆక్సిజన్ సరఫరాని పెంచుతుంది. అల్లం LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించి, క్లాట్ ఫార్మేషన్ సమస్యను తగ్గిస్తుంది. తరచుగా అల్లం తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. శరీరంలో శక్తిస్థాయిల్ని పెంచుతుంది. అల్లం మెన్స్ట్రువల్ క్రాంప్స్, మసల్ సోర్‌నెస్‌, ఆస్తియోఆర్థ్రైటిస్ పెయిన్‌ను తగ్గిస్తుంది. వెయిట్ మేనేజ్‌మెంట్‌కు కూడా సహాయపడుతుంది, మెటబాలిజమ్‌ను బూస్ట్ చేస్తుంది.

ఇలా తయారు చేసుకోవచ్చు…
తాజా అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్​ చేయాలి. ఒక కప్​ నీటిలో ఒక టీస్పూన్​ అల్లం ముక్కలు వేసి 5-10 నిమిషాలు మరిగించాలి. దాన్ని వడకట్టి తేనె, నిమ్మరసం కలిపి రోజుకి రెండు కప్పులు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

ఇదికూడా చదవండి…

ముల్లంగితో ఆ వ్యాధి మటాష్‌..!