ముల్లంగితో ఆ వ్యాధి మటాష్‌..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

ముల్లంగితో ఆ వ్యాధి మటాష్‌..!
– చలికాలంలో తింటే శరీరానికి మేలు
– ఎలా తీసుకోవాలో తెలుసుకోండి
దర్శిని డెస్క్ : ఆహార పదార్థాల్లో రారాజు వంటి ముల్లంగిని రోజూ మీ ఆహారంలో భాగం చేసుకుంటే చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ముల్లంగిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా దీనిని చలికాలంలో తినడం వలన ఇది శరీరానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. మలబద్దకం, మొలలు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి ముల్లంగి దివ్యౌషధం అంటున్నారు నిపుణులు.

ముల్లంగిలో అధిక మొత్తంలో పీచుపదార్థం ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలం సులభంగా కదిలేలా చేస్తుంది. తద్వారా మొలలపై ఒత్తిడి తగ్గుతుంది. దీనిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ముల్లంగిలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ముల్లంగి తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోటాషియం పుష్కలంగా అందుతుంది. తద్వారా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఉండే విటమిన్ సీ శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది. జలుబు, దగ్గు వంటి వాటిని అరికడుతుంది.

మొలల వ్యాధి మటాష్‌..
మొలల సమస్యతో బాధపడేవారికి ముల్లంగి ఒక వరం లాంటిది. దీనిని సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా మొలల వల్ల కలిగే బాధల నుండి సహజంగా ఉపశమనం పొందవచ్చు. ముల్లంగిలోని గుణాలు మొలల వల్ల కలిగే వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా మలబద్ధకం, మొలల సమస్యలు రాకుండా చూస్తుంది. ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు ముల్లంగి రసం తాగడం వల్ల మొలల సమస్య తగ్గుతుంది. ముల్లంగిని సన్నగా తురిమి, పెరుగు, నిమ్మరసం, కొత్తిమీరతో కలిపి తీసుకోవచ్చు.

ఇలా కూడా తీసుకోవచ్చు..
ముల్లంగి రసం రక్తస్రావాన్ని ఆపడానికి సహాయపడుతుంది. అయితే, సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ముల్లంగితో కూర, పచ్చడి వంటివి తయారుచేసుకొని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. ముల్లంగి చాలా రకాలుగా ఆరగించవచ్చు.. ఉడకబెట్టి తినొచ్చు. సాలాడ్స్ చేసుకోవచ్చు.. పచ్చడి చేసుకోవచ్చు.. సూప్స్ చేసుకుని తాగొచ్చు. సాంబార్ వంటి వాటిల్లో కూడా వేసుకోవచ్చు. అంతే కాకుండా వీటిని మెత్తగా పేస్ట్ చేసి, మొలలపై రాయడం వలన నొప్పి , వాపు తగ్గుతాయి.

ఇదికూడా చదవండి…

చలికాలంలో వెచ్చని సేవ..!