ఎమ్మెల్యేను కలిసిన ఓగిపూర్ సర్పంచ్
– సన్మానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం ఓగిపూర్ గ్రామ సర్పంచు మ్యాతరి నారాయణ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిశారు.

గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓగిపూర్ గ్రామ సర్పంచుగా మ్యాతరి నారాయణ, ఉపసర్పంచుగా విష్ణువర్దన్ రెడ్డిలు ఎన్నికయ్యారు. ఇందులో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని సర్పంచ్ మ్యాతరి నారాయణ, ఉప సర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్దికి అందరి సహాకారంతో కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ హర్ష వర్ధన్ రెడ్డి, పార్టీనేతలు, గ్రామ పెద్దలు ఉన్నారు.

ఇదికూడా చదవండి….

