కాంగ్రెస్ పార్టీకి రొంపల్లి గిఫ్ట్..!
– 35వ వార్డు అభ్యర్థి గెలుపు వెనక కృషి
– అన్నీ తానై నడించిన ప్రచారానికి ఫలితం
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పార్టీకి ఆయ పార్టీ యువనాయకులు రొంపల్లి సంతోష్ కుమార్ గెలుపు కానుకను అందజేశారు. పట్టణంలోని 35వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఫ్షామైనా భేగం గెలుపులో కీలకపాత్ర పోషించారు.

శుక్రవారం విడుదలైన ఎన్నికల ఫలితాలలో అప్షామైనా భేగం మెజార్టీ విజయం సాధించారు. తన వార్డు నుంచి పోటీ చేస్తున్న అప్షామైనాభేగం గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ తరుపున రొంపల్లి సంతోష్ కుమార్ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలకు ఇచ్చిన మాటను నెరవేర్చందుకు ఉదయం, సాయంత్రం కష్టపడ్డారు. అన్నీ తానై ముందుండి, పార్టీ నేతల సమన్వయంతో పనిచేశారు. సొంతంగా ప్రచారం చేసి పార్టీ అభ్యర్థి విజయానికి విశేష కృషి చేశారు. శుక్రవారం ప్రకటించిన ఫలితాలలో అఫ్షామైనా విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నమ్మిన కాంగ్రెస్ పార్టీ కోసం ఆమెను గెలుపును కానుకగా అందజేశారు.


