పట్టణాభివృద్ధి నిధులకు పచ్చజెండా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పట్టణాభివృద్ధి నిధులకు పచ్చజెండా..!
– రూ. 18.7 కోట్లకు పరిపాలన ఆమోదం
– ఎమ్మెల్యే కృషితో పనులకు గ్రీన్ సిగ్నల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో చేపట్టే అభివృద్ధి నిధులకు రాష్ట్ర పురపాలక శాఖ పచ్చజెండా ఊపింది. గత యేడాది నవంబర్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాండూరు మున్సిపల్ కు రూ. 18కోట్ల 70లక్షలను విడుదల చేసింది.

అర్బన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ కింద నిధులను మంజూరు చేసింది. తాజాగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో ఈ నిధుల కింద చేపట్టే పనులకు రాష్ట్ర పురపాలక శాఖ ఆమోదం తెలిపింది. మొత్తం నాలుగు విభాగాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు తాండూరు పట్టణంలోని కొత్తగా విలీనమైన కాలనీతో పాటు అవసరమైన వార్డులలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, కల్వర్టులు నిర్మించాలని నిర్ణయించారు.

అదేవిధంగా పట్టణంలోని బాలాజీ పార్కు అభివృద్ధితో పాటు పంపు హౌస్ ల పరిరక్షణకు నిధులు వినియోగించాలని నిర్ణయించారు. మరోవైపు పట్టణంలోని చెన్ గెష్ పూర్ రోడ్డు మార్గంలోని ఈద్గా నుంచి రాఘవేంద్ర దేవాలయం వరకు డ్రైన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఆయా పనులకు సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో రూ. 18.70 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. త్వరలోనే ఈ పనులను ప్రారంభించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

ఇదికూడా చదవండి…

జాతీయ స్థాయిలో రాణించాలి