వ‌ర్షానికి కూలిన ఇళ్లు

క్రైం తాండూరు రంగారెడ్డి వికారాబాద్

వ‌ర్షానికి కూలిన ఇళ్లు
– తాండూరు మండ‌లం మ‌ల్కాపూర్‌లో ఘ‌ట‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరులో గ‌త నాలుగైదు రోజులుగా వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వ‌ర్షాల కార‌ణంగా తాండూరు మండ‌లం మ‌ల్కాపూర్ గ్రామంలో ఓ ఇళ్లు కూలిపోయింది. ఈ సంఘ‌ట‌న సోమ‌వారం ఉద‌యం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సేడం షాబుద్దీన్ ఇంట్లో బొంరాస్‌పేట్ మ‌హేష్, అత‌ని భార్య ల‌క్ష్మీ, కూతురు మొత్తం న‌లుగురు అద్దెకు నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి భారీ వ‌ర్షం కార‌ణంగా సోమ‌వారం తెల్ల‌వారు జామున అక‌స్మాత్తుగా ఇంటి పైక‌ప్పు, వాసాలు న‌డి ఇంట్లో కూల‌బ‌డ్డాయి. అదృష్ట వ‌శాత్తు ఇంట్లో ఉన్న‌వారికి ఎలాంటి హాని జ‌ర‌గ‌లేదు. ఇదిలా ఉండ‌గా కూలిన ఇంటిని గ్రామ ఉప స‌ర్పంచ్ హ‌స‌న్ ప‌టేల్ ఇంటిని ప‌రిశీలించి, బాధితుల‌ను ప‌ల‌క‌రించారు. ఇళ్లు కూలి న‌ష్ట‌పోయిన బాధితుల‌కు ప‌రిహారం అందించాల‌ని బాధితుల త‌రుపున‌ కోరుతున్నారు.