సంబరంగా స్వామి వివేకానంద జయంతి

తాండూరు రాజకీయం వికారాబాద్

సంబరంగా స్వామి వివేకానంద జయంతి
– కేవీసీఎస్‌లో ఉత్సహాంగా నింపిన ఉత్సవాలు
– వివేకుని వేషాధారణలో మైమరించిన విద్యార్థులు
– ప్రదర్శనలు, ప్రసంగాలతో ఆకట్టుకున్న స్టూడెంట్స్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లీ మహరాజ్ దేవాలయంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు సంబరంగా జరుపుకున్నారు.
kvcs
సోమవారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ ల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. జయంతి సందర్భంగా స్కూల్ కు చెందిన విద్యార్థులు స్వామి వివేకానంద వేషాధారణలో హాజరయ్యారు. పాఠశాలలోని వేదికపై స్వామి వివేకానంద చిత్రపటానికి ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ లు పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు వివేకానంద స్వామి జీవిత చరిత్రపై ప్రదర్శన ఇచ్చారు.

స్వామి వివేకానంద దేశం కోసం, యువత కోసం చేసిన కృషిని, నింపిన స్పూర్తిని చాటుతూ ఇచ్చిన ప్రదర్శనలు మమైరిపించాయి. అదేవిధంగా స్కూల్ విద్యార్థులు వివేకానంద ఇచ్చిన సందేశాలపై ప్రసంగాలు చేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ స్వామి వివేకానంద దేశానికి ఆదర్శప్రాయుడు అని అన్నారు. ఆయన స్పూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మా యువతకు వివేకుడే స్పూర్తి..!