ఘనమైన గుర్తింపు తీసుకరావాలి
– సివిల్ ర్యాంకర్ మేఘను సన్మానించిన ఎంపీ రంజిత్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఐఏఎస్ఐగా తెలంగాణ రాష్ట్రానికి ఘనమైన గుర్తింపు తీసుకరావాలని చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు డా.గడ్డం రంజిత్‌రెడ్డి సివిల్స్ ర్యాంకర్ మేఘనతో పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం మర్పల్లి గ్రామానికి చెందిన కావలి మేఘన ఇటీవల వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 83వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. కాబోయే ఈ ఐఏఎస్‌కు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ఆదివారం కావలి మేఘన, ఆమె కుటుంబ సభ్యులు చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మేఘనను ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. మారుమూల ప్రాంతానికి చెందిన మేఘన కష్టపడి చదివి సివిల్స్‌లో ర్యాంకు సాధించడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. మేఘన ఐఏఎస్‌గా రాణించి మన రాష్ట్రానికి మరింత పేరు ఘనమైన గుర్తింపును తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేఘన తల్లిదండ్రులు ఉన్నారు.


