యువ సేవకుడికి బంగారు నంది అవార్డు
– రొంపల్లి సంతోష్ కుమార్‌కు దక్కిన గౌరవం
– పెద్దల ఆశీర్వాదం తీసుకున్న ఆర్ఎస్‌కే
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు చెందిన యువనాయకులు, సామాజిక సేవకులు, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి, రొంపల్లి సంతోష్ కుమార్(ఆర్ఎస్‌కే) నంది అవార్డును అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఈ అవార్డును పొంది గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆదివారం హైదరాబాద్ లో బిర్లా మ్యూజియంలో రితిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో గొల్డెన్ నంది అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో దూసుకెళుతున్న రొంపల్లి సంతోష్ కుమార్‌ను తెలంగాణ రాష్ట్ర స్ధాయి బంగారు నంది అవార్డుకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, టూరిజం కార్పోరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా రొంపల్లి సంతోష్ కుమార్ అవార్డును అందుకున్నారు.
మరోవైపు నంది అవార్డును పొందిన సందర్భంగా రొంపల్లి సంతోష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, వీబీజీ ఫౌండర్ మడిపడగా రాజు, ఆర్య వైశ హిందూ టైగర్ చికోటి ప్రవీన్‌లను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. వారితో ఆర్యవైశ్యుల అభివృద్ధిపై చర్చలు జరిపారు.

అదేవిధంగా అవార్డు పొందిన రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ రితిక ఫౌండేషన్ ద్వారా నంది అవార్డును పొందడం పట్ట సంతోషం వ్యక్తం చేశారు. పౌండేషన్ వారికి, ఉప్పల శ్రీనివాస్ గుప్తలకు కృతజ్ఞతలు తెలిపారు. చేసిన సేవా కార్యక్రమాలకు అవార్డు పొందడం ఎంతో స్పూర్తినిచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో బీద ఆర్యవైశ్యులకి అందరికీ వ్యాపార నిమిత్తం ఆర్థిక సాయం చేయడానికి చొరవ చూపుతామని అన్నారు.
ఇది కూడా చదవండి…


