రేపటి ప్రజావాణి మళ్లీ రద్దు
– ప్రకటించిన జిల్లా కలెక్టర్ కె.నిఖిల
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేపు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మళ్లీ రద్దుచేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కె.నిఖిల ఓ ప్రకటనలో వెల్లడించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వజ్రోత్సవ ద్వి సప్తాహా కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని చేయబోయ ఏర్పాట్ల కారణంగా కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ప్రకటనలో వివరించారు. వజ్రోత్సవ ఏర్పాట్లలో అధికార యంత్రాంగం హడావుడిలో ఉంటుందని, దీని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రజావాణిని రద్దు చేసినట్లు తెలిపారు. గత వారం కూడ భారీ వర్షాల కారణంగా ప్రజావాణి రద్దు అయ్యింది. తాజాగా రేపు నిర్వహించే ప్రజావాణి మరోసారి రద్దు అయ్యింది.



