దొరికేసిన దొంగల ముఠా..!

క్రైం తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

దొరికేసిన దొంగల ముఠా..!
– హంటింగ్‌ ఆపరేషన్ సక్సెస్‌
– రాబరీగాళ్లను పట్టకున్న పోలీసులు
– రెండు రోజుల్లోనే వీడిన మిస్టరీ
– చోరి నిందితులు, బైకుల స్వాదీనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో జరిగిన దారి దోపిడి దొంగలు దోరికేశారు. పోలీసులం అని బెధిరింపులకు పాల్పడిన అంతర్‌ రాష్ట్ర ముఠాను యాలాల పోలీసులు కటకటాల్లోకి నెట్టేశారు.

యాలాల పోలీసులు సాగించిన హంటింగ్ ఆపరేషన్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఎస్ఐ విఠల్ రెడ్డి రెండు రోజల్లోనే రాబరీగాళ్లను పట్టేసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే… ఈనెల 21న మండలంలోని రాస్నం గ్రామానికి చెందిన కోటం వెంకటలక్ష్మీ, ఆమె అన్న గోపాల్ రెడ్డిలు తాండూరు నుంచి బైకుపై గ్రామానికి వెళుతుండగా ఓ నలుగరు దుండగులు రెండు బైకులపై వచ్చి మేము పోలీసులం అని చెబుతూ వెంకటలక్ష్మీ వద్ద ఉన్న బంగారు ఆబరణాలు లాక్కుని బైకులపై పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డిల ఆధ్వర్యంలో 4ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

కర్ణాటక రాష్ట్రం బీదర్, గుల్బర్గా ప్రాంతంలో నిందితులను గుర్తించారు. 48 గంటల్లో ఎస్ఐ విఠల్ రెడ్డి ఆపరేషన్‌ హంటింగ్‌ను పూర్తి చేశారు. గుల్బర్గా పోలీసుల సహకారంతో ఏడుగురు నిందితులను పట్టుకున్నారు.  అయితే దొంగలు చోరి చేసిన బంగారాన్ని రికవరీ చేయడంలో గుల్బర్గా పోలీసులు సహకరించలేదని ఎస్ఐ విఠల్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ముఠా యాలాలలో చోరీకి ముందు మహబూబ్‌ నగర్ జిల్లాలో కూడా చోరీకి పాల్పడినట్లు కర్ణాటక పోలీసుల విచారణలో తేలింది.

ఇదికూడా చదవండి…

ఎస్‌కేటీఎస్‌లో వైభవంగా వసంత పంచమి