ఎస్‌కేటీఎస్‌లో వైభవంగా వసంత పంచమి
– సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు చేసిన విద్యార్థులు
– చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ (ఎస్‌కేటీఎస్‌లో)లో వసంత పంచమిని వైభవంగా జరుపుకున్నారు. శుక్రవారం చదువుల తల్లి సరస్వతి దేవి జన్మదినం సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

సరస్వతి దేవి విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు చేసి.. వేద పండితుల మంత్రోచ్చరణలో పూజలు నిర్వహించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు తమ పుస్తకాలు, పలకలను ఉంచి చదువులో రాణించేలా కటాక్షించాలని వేడుకున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు తమ చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. వేదపండితులు చిన్నారులతో అక్షరాలను దిద్దించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కరస్పాండెంట్ సర్వోత్తమ్ రెడ్డి, డైరెక్టర్ ద్యావరి జయవర్ధన్ రెడ్డిలు మాట్లాడుతూ సరస్వతి దేవి కటాక్షంతో విద్యార్థులు చదువులో రాణిస్తారని అన్నారు.

దేవి జన్మదినం వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం, పూజలు నిర్వహించడంతో దేవి కృప సిద్ధిస్తుందని అన్నారు. విద్యార్థుల సర్వతోముఖోభివృద్ధికి శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎన్. రమేష్, సీనీయర్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ కుమార్, సునీత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

