తాండూరు లయన్స్ క్లబ్.. ఎక్స్ లెంట్..!
– 14 అవార్డులు సొంతం చేసుకున్న క్లబ్
– క్లబ్ అధ్యక్షులు శరణు బసప్పకు అవార్డు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సామాజిక సేవా కార్యక్రమాలతో తాండూరు లయన్స్ క్లబ్ ఎక్స్ లెంట్ అనిపించుకుంది. పలు సామాజిక సేవా కార్యక్రమాలకు గాను రీజీయన్ మీట్ లో 14 ఎక్స్ లెంట్ అవార్డులను సొంతం చేసుకుంది.

శనివారం షాద్ నగర్లో ఇండిగో రీజీయన్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న తాండూరు లయన్స్ క్లబ్ కు ఎక్స్ లెంట్ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ అధ్యక్షులుగా శరణు బసప్ప, ఉత్తమ కార్యదర్శిగా మంకాల నటరాజ్, కోశాధికారి గౌరీశంకర్ లకు ఎక్స్ లెంట్ అవార్డులను అందజేశారు. అదేవిధంగా తాండూరుకు ఉత్తమ లయన్స్ క్లబ్, ఉత్తమ హంగర్ ప్రోగ్రాం, వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, విద్యార్థలకు చేయూత తదితర విభాగాలలో ఎక్స్ లెంట్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు శరణు బసప్ప, క్లబ్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అవార్డులు అందజేసిన ఇండిగో రీజీయన్ మీట్ చైర్మన్ మనోహర్ రెడ్డికి, ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

