బీఆర్ఎస్ మున్సిపల్ ఇంచార్జ్‌గా పంజుగుల శ్రీశైల్ రెడ్డి
– నియమించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తాండూరు, దర్శని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గా పంజుగుల శ్రీశైల్ రెడ్డి నియామకం అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి మున్సిఫల్ లో గులాబీ జెండా ఎగురవేసేందుకు దృష్టిసారించారు. ఈ మేరకు ప్రతి మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ లను నియమించారు. తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ గా ఆ పార్టీ మిడీయా అధికార ప్రతినిధి శ్రీశైల్ రెడ్డిని నియమించారు. తాండూరు మున్సిపల్ ఇంచార్జ్ గా నిమాయకం అయిన శ్రీశైల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బాబాయి కావడం గమనార్హం. శ్రీశైల్ రెడ్డి మున్సిపల్ ఇంచార్జ్ గా నియామకం కావడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

