వైభవంగా ఆంజనేయ విగ్రహ మొదటి వార్షికోత్సవం
– దర్శించుకున్న భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలం జుంటుపల్లిలో ప్రతిష్టించిన అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మొదటి వార్షికోత్సవ వేడుకులను వైభవంగా జరుపుకున్నారు. శనివారం విగ్రహ విరాళదాతలు ఆటికర్ అనురాధ, దత్తురావులు విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత యేడాది జుంటుపల్లి రామస్వామి దేవాలయంకు వెళ్లే మార్గంలో అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. విగ్రహ ప్రతిష్టాపన సంవత్సరం పూర్తి కావడంతో మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. భక్తుల రాకతో ప్రాంగణమంతా ఆద్యాత్మిక వాతావరణం నెలకొంది.
