బస్టాండ్ లో సెల్ ఫోన్ చోరీ..!

క్రైం రాజకీయం వికారాబాద్

బస్టాండ్ లో సెల్ ఫోన్ చోరీ..!
– రూ.30వేల మోబైల్ అపహరణ
– పోలీసులకు ఫిర్యాదు చేసిన వినియోగదారుడు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్టీసీ బస్టాండ్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రయాణికులు బస్సు ఎక్కుతుండగా రద్దీని అసరాగా చేసుకుని చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మోబైల్ ఫోన్లతో పాటు జేబులకు చిల్లులు పెడుతున్నారు. తాజాగా సోమవారం బస్టాండ్లో బస్సు ఎక్కున్న ప్రయాణికుని వద్ద నుంచి సెల్ ఫోన్ కొట్టేశారు. తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన శేరి వెంకట్రామ్ రెడ్డి అనే వ్యక్తి వికారాబాద్ వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండుకు వచ్చాడు.

హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కుతుండగా ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు వెంకట్రామ్ రెడ్డి వద్ద ఉన్న సెల్ ఫోన్ కొట్టేశారు. బస్సులో ఎక్కిన తరువాత పరిశీలించుకోగా అతని సెల్ ఫోన్ చోరీ అయినట్లు గుర్తించాడు. వెంటనే దిగి పరిశీలించగా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అనంతరం తాండూరు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

చోరీ అయిన మోబైల్ ను వారం రోజుల క్రితమే రూ.30వేలకు కొనుగోలు చేసినట్లు బాధితుడు వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఆర్టీసీ బస్టాండులో గత కొన్ని రోజులుగా ఇలాంటి దొంగతనాలు అధికం అయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చోరీలను అరికట్టేలా చూడాలని కోరుతున్నారు.

ఇదికూడా చదవండి…

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు