బీఆర్ఎస్ కోఆప్షన్ సభ్యుల ఖరారు..!
– నలుగురిలో.. ఇద్దరు మాజీ కౌన్సిలర్లకు చోటు
– ఎన్నికల తరువాత మరొకరికి చాన్స్
– ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ కోఆప్షన్ సభ్యులను మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రకటించారు. నలుగురు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు మంగళవారం తెలిపారు.

ఇందులో మైనార్టీ కోటా కింద మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, మహిళ కోటా కింద మరో మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్, మున్సిపల్ వ్యవహరాల్లో అనుభవం ఉన్న రాము ముదిరాజ్ లను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల తరువాత మరో కోఆప్షన్ సభ్యున్ని ఎన్నుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ మున్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందులో భాగంగా ముందుగానే కోఆప్షన్ సభ్యులను ప్రకటించడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు, సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి తదితరులు ఉన్నారు.

ఇదికూడ చదవండి…

