బీఆర్ఎస్ పార్టీకి సందీప్ రెడ్డి రాజీనామా

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్ పార్టీకి సందీప్ రెడ్డి రాజీనామా
– బీఆర్ఎస్వీ పదవి కూడా గుడ్ బై
– రాజీనామాకు కారణాలు అవే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీకి పట్లోళ్ల సందీప్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

బీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేధన వ్యక్తం చేశారు. పార్టీలో జెండా మోసుకున్న కార్యకర్తలకు మొండి చేయి చూపే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. పార్టీ కోసం రెండున్నరేళ్లకు పైగా పనిచేస్తే ప్యారచూట్ నేతలకు నేతలకే మున్సిపల్ టిక్కెట్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మాలాంటి వాళ్లను వాడుకుని పక్కన పెట్టే వాళ్లకు బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అయ్యే రోజు దగ్గరలోనే ఉందని తెలుస్తుందని అన్నారు. నాలాగే జెండా యువకులు పార్టీని నమ్మి మోసపోవద్దని అన్నారు. త్వరలోనే తన కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు.

ఇదికూడా చదవండి…

అట్టహాసంగా ‘పట్లోళ్ల’ నామినేషన్..!