అట్టహాసంగా ‘పట్లోళ్ల’ నామినేషన్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అట్టహాసంగా ‘పట్లోళ్ల’ నామినేషన్..!
– సాయిపూర్ నుంచి గులాబీ సేనతో ఊరేగింపు
– పాల్గొన్న తాండూరు మాజీ ఎమ్మల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పట్లోళ్ల ఫ్యామీలి అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేసే కార్యక్రమాన్ని అట్టహాసంగా జరుపుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ స్థానానికి పట్లోళ్ల నర్సింలు(10వ వార్డు), సాయిపూర్ 9వ వార్డు నుంచి మాజీ వైస్ చైర్మన్ పట్లోళ్ల దీపా నర్సింలు దంపతులు పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.

నామినేషన్ల పక్రియ ప్రారంభమైన తొలిరోజే పట్లోళ్ల నర్సింలు, రెండో రోజు దీపా నర్సింలు మొదటి సెట్ల నామినేషన్లు వేశారు. శుక్రవారం చివరి రోజు రెండో సెట్ల నామినేషన్ల దాఖలను అట్టహాసంగా చేశారు. సాయిపూర్ నుంచి ఊరేగింపు నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నేతలు గులాబీ జెండాలతో ఊరేగింపులో తరలివచ్చారు. పట్టణ పురవీధులు గులాబీ మయంగా మారాయి.

ఈ ఊరేగింపులో తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డిలు పాల్గొన్నారు. ప్రత్యేక వాహనంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, శ్రీశైల్ రెడ్డిలతో పాటు పట్లోళ్ల నర్సింలు, దీపా నర్సింలు ఊరేగింపులో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని పట్లోళ్ల నర్సింలు, దీపా నర్సింలులు రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ లైబ్రరీ చైర్మన్ రాజుగౌడ్, పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కాంగ్రెస్‌ చైర్మన్‌ నిర్ణయం అప్పుడే..!