నిస్వార్థ సేవకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

నిస్వార్థ సేవకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి
– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్
– ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సహాక చెక్కులు పంపిణీ
– ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పహార వితరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిస్వార్ధ సేవకుడు అని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ అన్నారు. బుధవారం తాండూరులో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు యు.రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీ జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు, బందువులకు అల్పాహారం వితరణ చేశారు.

అదేవిధంగా పట్టణంలోని గంజ్ అసోసియేషన్ హాల్ లో కేక్ కట్ చేసి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జస్టిస్ కొండా మాధవ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సహకంగా నగదు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా యు.రమేష్ కుమార్ మాట్లాడుతూ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిస్వార్థ సేవకుడు అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛత ట్రక్కులను ఏర్పాటు చేసి మూత్రశాలలు పరిశుభ్రం చేయిస్తున్నారని అన్నారు.

అదేవిధంగా విద్యార్థులకు తోడ్పాటు అందిస్తున్నారని. కోట్ పల్లి ప్రాజెక్టులో బోట్లు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. వారి కుటుంబం అంతా ప్రజా సేవలో ఉందని, అదే మార్గంలో ముందుకు సాగుతున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరింత ఉన్నతంగా ఎదగాలని, ఆరోగ్యంగా ఉండాలనని ఆకాంక్షించారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం నర్సింలు, సీనీయర్ నాయకులు గాజుల శాంతుకుమార్, బాలి శివకుమార్, మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత, మోత్కుపల్లి చంద్రశేఖర్, పూజారి పాండు, మల్లేశ్ యాదవ్, మంతటి రాజు, దోమ కృష్ణ, చిత్ర ప్రకాష్, సంగమేశ్వర్, రాంచెందర్, ప్రభాకర్ గౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

బ్రహ్మ కుమారీల ఆధ్యాత్మిక సేవ ప్రశంసనీయం