పోరపాట్లు లేకుండా ఎన్నికల విధులు నిర్వహించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

పోరపాట్లు లేకుండా ఎన్నికల విధులు నిర్వహించాలి
– మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి
– ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా విధులు నిర్వహించాలని కమీషనర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం తాండూరు పట్టణం సాయిపూర్ లోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమీషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పట్టణంలో 140 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో పాల్గొనే అధికారులు ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రశాతంగా జరిగేలా దృష్టిసారించాలని అన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఆశ్రద్ద వహించకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు.

శిక్షణలో సూచించిన విధంగా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు సవ్యంగా జరిగేలా చూడాలని అన్నారు. అదేవిధంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు దరఖాస్తులను చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీప్యూటి తహసీల్దార్ లలిత, ఆరి రాఘవేందర్, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఎన్నికల శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పట్లోళ్ల దీపా నర్సింలు.. దూకుడు..!