విద్యుత్ సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదు
– తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
– 26వ వార్డులో గల్లి గల్లికి ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్ పారిశుద్ధ్యం సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహించరాదని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులో గల్లి గల్లీకి ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో అపరిశుభ్రత ఏర్పడకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్యం పాటించాలని ఎమ్మెల్యే శానిటేషన్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లూజ్ వైరింగ్ సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. వార్డులోని పార్కు అభివృద్ధికి రూ.5 లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. వాటితో ఆ పార్కును అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట రెడ్డి, కౌన్సిలర్లు మంకాల రఘు, నీరజ బాల్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు వెంకట్ రామ్ నాయక్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ సంపత్ నర్సింలు, నయీం ఆఫ్ఫు, రాజు గౌడ్, శ్రీనివాసాచారి, హరి హరా గౌడ్, ఇర్ఫాన్, కటకం వీరేందర్, చెన్ బసప్ప, భాను సేట్, పటేల్ ప్రవీణ్, అర్. సంతోష్, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
