బీజేపీలో స్వార్థ రాజకీయాలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీజేపీలో స్వార్థ రాజకీయాలు..!
– పార్టీలో అనర్హుడికి కౌన్సిలర్ టిక్కెట్
– కమలం పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజినామా
– 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిపై హైకోర్టులో పిటిషన్
– బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీలో స్వార్థ రాజకీయాలు జరుగుతున్నాయి, పార్టీ కోసం పనిచేసే నేతలకు గుర్తింపు లేకుండా పోయిందని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ గౌడ్ అన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్ష పదవితో పాటు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం మీడియా సమావేశంలో ప్రకటించారు.

తండ్రి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్తయ్య గౌడ్ ఆశయాలతో, పార్టీ సిద్ధాంతలకు లోబడి బీజేపీ పార్టీ బలో పేతానికి ఎంతో కృషి చేయడం జరిగిందని గుర్తుచేశారు. అయినా తన కుటుంబానికి కాదని మున్సిపల్ ఎన్నికల్లో సొంత పార్టీకి చెందిన అనర్హుడికి పార్టీ టిక్కెట్ ఇచ్చారని విమర్శించారు. వికారాబాద్ జిల్లా కొత్తపల్లి పంచాయతీలో ఓటు హక్కు కలిగి ఉన్న పార్టీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశంకు టిక్కెట్ ఇచ్చారని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, అధిష్టాన నేతలను ప్రశ్నించడం జరుగుతుందన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అనర్హుడుగా ఉన్న నాగారం మల్లేశం విషయంలో హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేయడం జరిగిందని తెలిపారు. 28వ వార్డులో ఓటర్లు బీజేపీకి ఓటు వేస్తే ఆ ఓట్లు చెల్లకుండా పోతాయని అన్నారు. పార్టీలో స్వార్థ రాజకీయాలు నచ్చక జిల్లా ఉపాధ్యక్ష పదవి, సభ్యత్వానికి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తు నిర్ణయాలను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.

ఇదికూడా చదవండి…

వాల్మీకీ నగర్ బాధలు తీరుస్తా..!