స్కావేంజర్లకు ఖుషీ ఖబర్…!

తాండూరు రాజకీయం వికారాబాద్

స్కావేంజర్లకు ఖుషీ ఖబర్…!
– మూడు నెలల వేతనాల విడుదల
– హర్షం వ్యక్తం చేసిన పీఆర్టీయూ నేతలు
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావేంజర్లకు శుభవార్త అందించారు. మూడు నెలలకు సంబంధించిన వేతనాలను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత ఆగస్టు నెలలో టీఎస్ పీఆర్టీయూ నేతలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే స్కావేంజర్లకు పెండింగ్ జీతాలను మంజూరు చేయాలని నియోజవర్గ ఎమ్మెల్యేలు, ప్రభుత్వానికి వినతులు చేశారు.

ఆగస్టు 2వ తేదిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి యాలాల మండల పీఆర్టీయూ శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల్లో పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, మొక్కలకు నీరు పోయడానికి సేవాభావంతో స్కావెంజర్లను నియమించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. వారికి 3 నెలల వేతనాన్ని స్కూల్ మేయింటెన్స్ నుంచి చెల్లించడం జరిగిందని, ఇంకా 7 నెలలకు సంబంధించి గ్రాంట్ విడుదల కాలేదని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
kvcs
తాజాగా ప్రభుత్వం స్కావేంజర్లకు వేతనాలు మంజూరు చేయడం పట్ల పీఆర్టీయూ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు కడియాల చంద్రశేఖర్, గౌరవాధ్యక్షులు వెంకట్రామ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్‌నాద్‌లకు యాలాల మండల పీఆర్టీయూ తరుపున మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాములు, జి.నర్సిరెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే మిగతా పెండింగ్ వేతనాలు కూడా విడుదల చేయాలని కోరారు.

ఇదికూడా చదవండి…

ఆధ్యాత్మిక సేవలో విఠల్ నాయక్…!