మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలి
– ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీయండి
– బీఆర్ఎస్ హాయాంలోనే తాండూరు అభివృద్ధి
– మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు
– మరోసారి దీపా నర్సింలును ఆదరించండి
– సాయిపూర్ అభ్యర్థులకు భారీమెజార్టి అందించాలి
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– సాయిపూర్‌లో అట్టహాసంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇచ్చిన హామిలను అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.

బుధవారం రాత్రి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని సాయిపూర్ 9, 10, 11వ వార్డులకు సంబంధించి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. బీఆర్ఎస్ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరయ్యారు. 9వ వార్డు నుంచి మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, 10వ వార్డు నుంచి బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు, 11వ వార్డు నుంచి రాజేష్ చారిలను గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే తాండూరు అభివృద్ధి జరిగిందన్నారు. సాయిపూర్ ప్రాంత అభివృద్ధికి రూ. 16 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు. రూ.2వేల ఫించన్, వికలాంగులకు రూ. 4వేల పించన్, మహిళలకు రూ.2500లు, తులం బంగారం అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. సాయిపూర్ ప్రాంతంలోని రైతులకు రైతు బంధు సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. ఓ మహిళ నేత అసెంబ్లీ ఎన్నికల తరువాత తులం బంగారం నా ఇంటికి వచ్చి తీసుకపోవాలని చెప్పిందని, ఇప్పటికి ఎంత మందికి ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు.

ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు కావడం ఖాయమని, 10వ వార్డులో ఆయనతో పాటు సాయిపూర్ 9వ వార్డు నుంచి దీపా నర్సింలు, 11వ వార్డు అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ సత్తా చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు. పెద్దేముల్ మాజీ ఎంపీపీ ఆనురాధ, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రమ్మ, యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సాయిపూర్ బీఆర్ఎస్ నేతలు. పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

గులాబీ గూటికి చేరిన వెంకటేష్‌ చారి..!