గులాబీ గూటికి చేరిన వెంకటేష్ చారి..!
– పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
– పార్టీలో చేరికకు అసలైన కారణం ఇదే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఉద్యమ కారుడు, గాజీపూర్ మాజీ ఎంపీటీసీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు వెంకటేష్ చారి గులాబీ గూటికి చేరారు. ఒకవిధంగా వెంకటేష్ చారి సొంతగూటికి చేరుకున్నారు. బుధవారం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు.

పైలెట్ రోహిత్ రెడ్డి వెంకటేష్ చారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, విద్యార్థి నాయకుడిగా యువతలో జిల్లాలో గట్టి పట్టున్న వెంకటేష్ చారి ఎంపీ ఎన్నికల సమయంలో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. .కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుండి వెంకటేష్ చారి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా రోహిత్ రెడ్డి కోరిక మేరకు వెంకటేష్ చారి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాండూర్ పట్టణంలో గాంధి నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి సంతోష్ గౌడ్ తండ్రి ఆకస్మిక మరణంతో, సంతోష్ గౌడ్ కి తోడుగా వెంకటేష్ చారి ని రంగలోకి దింపినట్లు సమాచారం. ఈ కార్యక్రమములో సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, రమేష్, జనార్దన్ రెడ్డి,మాజీ సర్పంచ్ వీరప్ప,ఉప సర్పంచ్ ఎల్లప్ప,ముస్తఫా, లాలు, అంజి, వెంకట్ గౌడ్,కృష్ణ,వెంకట్, గుండప్ప, మహేష్, తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

