వర్షాలు కురిపించు శివయ్యా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వర్షాలు కురిపించు శివయ్యా..!
– ఐదు శివాలయాల్లో జలాభిషేకాలు
– గంజ్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వర్షాలు కురిపించు శివయ్య అంటూ తాండూరు ది గ్రేన్ అండ్ సీడ్స్‌(గంజ్‌) అసోసియేషన్ పరమ శివున్ని వేడుకున్నారు.

గత రెండు నెలల నుండి వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అసోసియేషన్ ఆధ్వర్యంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం తాండూరు పట్టణం పాత తాండూరులోని కోటేశ్వర దేవాలయం, భద్రేశ్వర దేవాలయం(శివాలయం), నగరేశ్వర దేవాలయం, అంతప్పబావి శివాలయం, చెరువెంట ఈశ్వర శివాలయం మొత్తం ఐదు శివాలయాలో శివలింగాలకు జలాభిషేకం నిర్వహించారు.

వేద మంత్రోచ్చరణల మద్య వర్షాలు మంచిగా కురిసి, పంటలు బాగా సమృద్ధిగా పండాలని శివున్ని ప్రార్థించారు. రైతులు సుభిక్షంగా ఉండాలని, వ్యాపారస్తులకు లాభం కలగాలని పూజించారు. ఈకార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కటకం వీరేందర్, కార్యదర్శి దరిమిది ప్రభు, కోశాధికారి భోజిరెడ్డి పటేల్, మాజీ అధ్యక్షులు పటేల్ శ్రీశైలం, మల్లెపల్లి వెంకటేశం, కల్వరాధాకృష్ణ, సల్లా దామోదర్, బంటారం సుధాకర్, వెంకట్ రాములు గౌడ్, పటేల్ రాంరెడ్డి, సభ్యులు బానకారి కృష్ణ, నాగారం జగదీశ్వర్, మంకాల రవీందర్, మోముల మాణిక్యం, రాజేష్ సోనీ, నార జయపాల్ రెడ్డి, బాలేశ్వర్ గుప్తా, మల్లెపల్లి మధుసూదన్, బి. శ్రీధర్, శంబుని నర్సింలు, చాంకూరి విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు.


మంత్రుల పర్యటన వాయిదా..!