కారుని గుర్తించుకోండి..!
– అభివృద్ధికి అన్నింటికీ ముందుంటాం
– 24 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోట్రిక నాగలక్ష్మి
– ఇంటింటికి తిరుగుతూ ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని 24 వార్డు అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకే గుర్తించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కోట్రిక నాగలక్ష్మి శ్రీకాంత్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా వార్డులో ప్రచారం నిర్వహించారు.

సందర్భంగా ఆమె బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఎన్నికల పత్రాలను ఇంటింటికి పంచుతూ ఓటును అభ్యర్థించారు. మహిళలకు బొట్టు పెడుతూ ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అన్ని సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అభివృద్ధికి.. అన్ని సమస్యల పరిష్కారానికి ముందుంటామని పేర్కొన్నారు. ప్రజలకు 24వ వార్డులో 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలిపారు.

ఎన్నికల్లో మరవకుండా కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆమె ప్రచారానికి వార్డు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో 24 వ వార్డులో కోట్రిక నాగలక్ష్మి గెలుపు బాటలో దూసుకుపోతున్నారు. ఆమె ప్రచారంలో భర్త కోట్రిక శ్రీకాంత్, పార్టీ నేతలు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

