అదరగొట్టిన అల్లాపూర్ శ్రీకాంత్..!
– మున్సిపల్ ఎన్నికల్లో సంచలన గెలుపు
– బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిపై ఘన విజయం
– అభినందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో అల్లాపూర్ శ్రీకాంత్ అదరగొట్టారు. పురపోరులో సంచలన విజయం సాధించారు. సాయిపూర్‌లోని 10వ వార్డు నుంచి అల్లాపూర్ శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఇదే వార్డు నుంచి బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన పట్లోళ్ల నర్సింలుపై విజయం సాధించారు. 383 ఓట్ల మెజార్టీతో హిస్టరీ విన్నింగ్ నమోదు చేశారు.

సాయిపూర్‌లో చాలా ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న పట్లోళ్ల నర్సింలుపై యువకుడు పోటీ చేసి విజయం సాధించడం చర్చనీయాశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి.. చైర్మన్ అభ్యర్థిని ఓడించిన అల్లాపూర్ శ్రీకాంత్‌ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

ఇదికూడా చదవండి…

