బీఆర్ఎస్ పార్టీలో జోష్..!
– గెలిచిన అభ్యర్థులను అభినందించిన రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు బీఆర్ఎస్ పార్టీలో జోష్ నిండుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన కౌంటింగ్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు విజయం సాధించారు.

పట్టణంలోని 1వ వార్డు నాగలక్ష్మీ, 7వ వార్డు ఈర్షాద్, 13వ వార్డు సురేష్ నాయక్, 31 యోగానంద్ తదితరులు విజయం సాధించారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించిన వారిని రోహిత్ రెడ్డి అభినందించారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపును పురస్కరించుకుని పార్టీ నేతలు చేసిన నినాదాలు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్, మాజీ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

