కాంగ్రెస్ జోలికి వస్తే ఖబడ్దార్..!
– పైలెట్ ఒళ్లు దగ్గర పెట్టుకోండి
– మెజార్టీ లెక్కలపై దొంగ ఎడుపు
– రౌడీయుజం, దొంగలతో కలిసి రభస
– మత్తు ప్రవర్తనపై ఇరువర్గాలను పరీక్షించాలి
– కౌంటింగ్ కేంద్రం రచ్చను ఖండించిన డీసీసీ అధ్యక్షులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్ హెచ్చరించారు. శుక్రవారం తాండూరులో ఆయన మీడీయాతో మాట్లాడారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్ వద్ద జరిగిన రభసను ఖండించారు. ఓట్ల లెక్కింపు ముగింపు దశకు చేరుకునే సమయంలో.. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు వచ్చిన తరువాతే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కౌంటింగ్ హాల్ వద్దకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వచ్చారని తెలిపారు. కౌంటింగ్ హాల్‌లో అడుగు కూడా పెట్టకుండా మీడియా పాయింట్ వద్దనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కౌంటింగ్ హాల్ వద్దకు చేరుకుని రభస చేశారని అన్నారు. పోలీసులు రోహిత్ రెడ్డితో పాటు కొందరు అనుచరులను అనుమతించినప్పటికి ఆయన బ్యాచ్ కిరికిరి చేశారని అన్నారు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపైకి దూసుకుంటూ వస్తూ.. లెక్కలు తారుమారు చేస్తున్నారని విమర్శించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మంది రౌడీయిజం చేశారని అనడం సిగ్గుచేటని అన్నారు. అలాంటి పనులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేయరని అన్నారు. అలాంటి దొంగ లెక్కలు, లంగలెక్కలు చేసేది రోహిత్ రెడ్డి అని అన్నారు. ఎన్నికల్లో 28 సీట్లు గెలుస్తామని దీమా తలకిందులు కావడంతో ఫ్రస్టేషన్‌కు గురయ్యారని, అందుకే మతిబ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో 12 సీట్లకే పరిమితం చేసి చెప్పుకొట్టినట్లు చేసినా పద్దతి మార్చుకోలేదని అన్నారు. ఈ 12 సీట్లు కూడా డా.సంపత్ కుమార్ వల్లే వచ్చాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు దక్కడంతో దొంగ ఏడుపుకు తెరలేపారని అన్నారు. పార్టీని నడిపే సత్తా పైలెట్ రోహిత్ రెడ్డికి లేదని అన్నారు. రాజకీయాలకు పనికిరాని ఆయన ఎమ్మెల్యేపై నాన్ లోకల్ అంటూ విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. దాని గురించి మరోసారి మాట్లాడొద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రౌడియిజం, దొంగలెక్కలు చెప్పడం రాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. అదేవిధంగా కౌంటింగ్ హాల్ వద్ద పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన అనుచరులు చేసిన హాంగామాపై పోలీసులు నార్కోటిక్ పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ వర్గాలను కూడా పరీక్షించుకోవచ్చని అన్నారు. అదేవిధంగా పైలెట్ రోహిత్ రెడ్డిని తాగుబోతు.. డ్రగ్ తాగుతారని విమర్శలు చేశారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీగౌడ్, డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మహిళ నాయకులు శోభారాణి, గాజుల మాధవి తదితరులు ఉన్నారు.

