పేదింటికి ఫ్రీ డిష్‌ టీవీ

జాతీయం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

పేదింటికి ఫ్రీ డిష్‌ టీవీ
– ఉచితంగా అందించనున్న కేంద్రం
– మారుమూల ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయం
దర్శిని ప్రతినిధి: దేశంలో పేద ప్రజలకు ఉచితంగా రేషన్ అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మారుమూల ప్రాంతాల్లోని పేదింటికి ఉచితంగా డిష్‌ టీవీలను అందించాలని కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల పరిస్థితిని మెరుగుపరిచేందుకు మోదీ సర్కార్ ఈ పెద్ద నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 28 ప్రాంతీయ వాటితో సహా 36 టీవీ ఛానెల్‌లను నిర్వహిస్తోంది దూరదర్శన్ . సంబంధించిన తయారీ, సేవల ద్వారా పరోక్ష ఉపాధిని సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. డిడి ఫ్రీ డిష్‌ను విస్తరించడం వల్ల డిటిహెచ్ బాక్సుల తయారీలో ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని యోచిస్తోంది. దేశంలో పబ్లిక్ సెక్టార్ ప్రసారాలను పెంచడానికి సెంట్రల్ స్కీమ్‌కు ఆమోదం తెలుపుతూ.. కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆల్ ఇండియా రేడియో FM ఛానెల్‌ల కవరేజీని 80 శాతానికి పైగా జనాభాకు విస్తరించాలని, 8 లక్షల డీడీ ఉచిత డిష్ డీటీహెచ్‌ను పంపిణీ చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సెట్-టాప్ బాక్స్‌లు అందించాలని నిర్ణయించింది. వీటిలో గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలతో పాటు సరిహద్దు ప్రాంతాలు కూడా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల పరిస్థితిని మెరుగుపరిచేందుకు రూ.2,539 కోట్లు వెచ్చించాలని మోదీ ప్రభుత్వ మంత్రివర్గంలో నిర్ణయించింది. దాదాపు 7 లక్షల మంది ఇళ్లలో ఉచితంగా డిష్ టీవీలను అందించాలని ప్లాన్ చేసింది. ఈ పథకం ద్వారా డీటీహెచ్‌ని మరింతగా విస్తరించాలన్నది కేంద్రం ప్లాన్ . దీంతో పాటు డీడీ పాత స్టూడియోలోని పరికరాలు, ఓబీ వ్యాన్‌ను పూర్తిగా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.