సావిత్రిబాయి కృషితోనే మహిళల సాధికారత
– ఆమె ఆశయ సాధనకు అందరు కృషి చేయాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
– మహాత్మ జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్లో జయంతి వేడుకలు
– విద్యార్థులకు కుర్చీలు, ప్యాడ్లు అందించిన యువనాయకులు బాలకృష్ణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే చేసిన కృషితోనే మహిళలలో సాధికారత వచ్చిందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న మహాత్మ జ్యోతిబా పూలే బాలుర రెసిడెన్షియల్ స్కూల్లో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వె డుకులకు రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై స్కూల్ ప్రిన్సిపల్ నరేష్, అద్యాపకులతో కలిసి సావిత్రి బాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళలు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా సావిత్రి బాయి ఎంతో కృషి చేశారని అన్నారు.
అట్టడుగు వారికి, ముఖ్యంగా మహిళల కోసం చేసిన కృషి వల్లే నేడు మహిళలు అన్ని రంగాల్లో సాధికారతను సాధిస్తున్నారని అన్నారు. అదేవిధంగా మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలు ప్రైవేటుకు ధీటుగా కొనసాగుతున్నాయన్నారు. విద్యార్థులు, మహిళలు సావిత్రి బాయి పూలే ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం సావిత్రి బాయి పూలే జయంతిని మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షణీయమన్నారు. అదేవిధంగా జయంతి వేడుకల్లో విద్యార్థులు ఇంగ్లీష్ లో ఇచ్చిన ప్రసంగాలు. నృత్య ప్రదర్శనలు. ఆకట్టుకున్నాయి. మరోవైపు తాండూరుకు చెందిన యువనాయకులు బాలకృష్ణ పదో తరగతి విద్యార్థుల కోసం కుర్చీలు, పరీక్షా ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
బీసీ సంఘం ఆధ్వర్యంలో
మరోవైపు బీసీ సంఘం ఆధ్వర్యంలో తాండూరులో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సావిత్రి బాయి చిత్రపటానికి సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మహిళ అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి, నాయకులు జ్యోతి, అనిత, మంజుల, విజయలక్ష్మీ, నర్సమ్మ, మండలాల అధ్యక్షులు లక్ష్మణ్ చారి. నరేందర్, శ్రావణ్ కుమార్, బసంత్. విద్యాంతులు పర్యాద రామకృష్ణ, గ్లోబల్ యువతరం ఫౌండేషన్ సభ్యులు ఆరుణ్ రాజ్, యువజన సంఘం నాయకులు రాము ముదిరాజ్, బసవరాజ్, జుంటుపల్లి వెంకట్, శివకుమార్, గిరిజాపుర్ రమేష్, బాబా గౌడ్, దుబాయి వెంకట్, దత్తాత్రేయ, మంతటి రాజు, హరి ప్రసాద్, జగన్, ఇందూరు వెంకట్, సయ్యద్ లాల, కుల సంఘాల పెద్దలు. విద్యావంతులు, మేధావులు పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఇదికూడా చదవండి…

