యాలాల మండల ఎంఈఓగా శేరి మహిపాల్ రెడ్డి
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
– శుభాకాంక్షలు తెలిపిన పీఆర్టీయూ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండల విద్యాధికారి(ఎంఈఓ)గా శేరి మహిపాల్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

శేరి మహిపాల్ రెడ్డి యాలాల మండలం కోకట్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జీహెచ్ఎంగా పనిచస్తున్నారు. ప్రస్తుతం యాలాల మండల విద్యాధికారిగా రమేష్ కొనసాగుతున్నారు. అయితే ప్రభుత్వం సీనీయారీ ప్రకారం నియామకం చేపట్టడంతో యాలాల మండల విద్యాధికారిగా శేరి మహిపాల్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శేరి మహిపాల్ రెడ్డి యాలాల మండల విద్యాధికారిగా నియామకం కావడం పట్ల యాలాల మండల పీఆర్టీయూ శాఖ అధ్యక్షులు సి.కృష్ణారెడ్డి, కార్యదర్శులు శుభాకాంక్షలు తెలిపారు. మండల విద్యాధికారిగా మహిపాల్ రెడ్డి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మండలంలో విద్యాభివృద్ధి కృషి చేయాలని అభిలాషించారు.


