ప్రజా సమస్యలపై పోరాటం చేయండి..!

తాండూరు వికారాబాద్

ప్రజా సమస్యలపై పోరాటం చేయండి..!
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌ రెడ్డి
– బీఆర్ఎస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్‌ పార్టీ తరుపున ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.

గురువారం తన నివాసంలో రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా మాజీ వైస్ చైర్ పర్సన్‌ పట్లోళ్ల దీపా నర్సింలును నియమించి నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఫ్లోర్ లీడగా మున్సిపల్‌లో అధికార పార్టీ అవినీతికి పాల్పడితే ఎత్తి చూపాలని అన్నారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే దానిపై పోరాటం చేయాలని సూచించారు. ఫ్లోర్‌ లీడగా సమర్థవంతంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి పాటుపడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, నూతన కౌన్సిలర్లు నాగలక్ష్మి అనంత్ రెడ్డి, బి అనిల్ కుమార్, ఎండి ఇర్షాద్, ఎండి జావిద్, పట్లోళ్ల దీప నర్సింలు, సురేష్ నాయక్, నవీన సంతోష్ గౌడ్, నసీరాబాను (ఎజాజ్), అవుసుల యోగానంద్, మహేశ్వరి, సుప్రీత కరుణాకర్ పాటిల్, రూప రుద్రు పాటిల్ తదితరులు ఉన్నారు.

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ బదిలీ