100శాతం పన్నులు వసూలు చేయాలి
– ఎలాంటి నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పవు
– మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఆస్తి పన్నులను వందశాతం వసూలు చేసి తీరాలని మున్సిపల్ కమీషనర్ పి.మధుసూదన్ రెడ్డి అన్నారు.

శనివారం మున్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్‌లో కమీషనర్ బిల్ కలెక్టర్లు, వార్డ్ ఆఫీసర్లు లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాండూరు పట్టణంలో ఆస్తి పన్నుల వసూల్లలో వేగం పెంచాలన్నారు. పాత బకాయలు ఉన్నవారికి రెడ్ నోటీసులు జారీ చేయాలని చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలతో ఇంటింటికి వెళ్లి ఆస్తి పన్ను వసూలు చేయాలని సూచించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

ఆస్తుపన్ను చెల్లించి ఇంటి యజమానులు మున్సిపాలిటీ అభివృద్ధికిసహకరించాలని ఆయన కోరారు. ఆస్తి పన్ను వసూలలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిచర్యలు తప్పవని తెలిపారు. మొండి బకాయిలను రాబట్టడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వందశాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు కష్టపడి పనిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, జి.రాములు, బిల్ కలెక్టర్లు,వార్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.


