ధర్మ దాత వాసుపవార్ నాయక్
– ఘనంగా సన్మానించిన గౌతాపూర్ గ్రామస్తులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం అంతారం తాండా భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థాన వ్యవస్థాపకులు వాసు సవార్ నాయక్ ను గౌతాపూర్ గ్రామస్తులు ధర్మ దాతగా అభివర్ణించారు. శుక్రవారం నుంచి గౌతాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో దేవతా మూర్తుల ప్రతిష్టాపన ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రతిష్టాపన ఉత్సవాలలో వాసు పవార్ నాయక్ ఆలయంలోప్రతిష్టించేందుకు నందీశ్వరుడు, బ్రమరాంబిక, వినాయకుడు. ధ్వజ స్థంబం, పలు దేవత మూర్తుల విగ్రహాలతో పాటు ఉత్సవాలకు రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గురువారం ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి, గ్రామ సర్పంచ్ రాజప్ప గౌడ్, మహిళ నాయకురాలు శకుంతల దేశ్ ముఖ్ పాండే ఆధ్వర్యంలో వాసు పవార్ నాయక్ కు ఘన సన్మానం నిర్వహించారు.

అంతకుముందు గ్రామ రోడ్డు నుంచి ఆలయం వరకు వాసు పవార్ నాయక్ కు ఊరేగింపుతో ఘన స్వాగతం పలికారు. డప్పు బ్యాండ్ బాజా వాయిద్యాల మద్య వాసు పవార్ ను ఊరేగింపుగా తీసుకు వచ్చారు. ఆలయం వద్ద ఆలయ కమిటి తరుపున వాసు పవార్ నాయక్ కు శాలువా, పూల మాలతో సత్కరించి సన్మానించారు. మల్లికార్జున స్వామి దేవాలయంలో దేవతా మూర్తుల విగ్రహాల ప్రతిష్టాపనకు, ఉత్సవాలకు ఆర్థిక సహాయం అందజేసి వాసు పవార్ నాయక్ ధర్మ దాతగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పత్తి చంద్రప్ప, మాజీ సర్పంచ్ జన్నే నాగప్ప, టీఆర్ఎస్ నాయకులు రాంచంద్రారెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

