కురుమల గౌరవానికి తోడ్పడతా..!
– తాండూరులో బీరప్ప చౌరస్తా ఏర్పాటుకు కృషి
– దొడ్డి కొమరయ్య విగ్రహా పునరుద్దరణపై శ్రద్ద
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి
– తాండూరు కుర్వ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కురుమల గౌరవాన్ని పెంపొందించేందుకు తన వంతు తోడ్పాటు అందిస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు.

ఆదివారం తాండూరు డివిజన్ కుర్వ సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న బీరప్ప స్వామి దేవాలయ సమీపంలో మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎన్నికైన పట్లోళ్ల నీరజా రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి దంపతులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి మాట్లాడుతూ కురుమ సంఘం నాయకులు తమపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. తాండూరులో కురుమల గౌరవం పెంపొందించేందుకు తోడ్పాటు అందిస్తానని అన్నారు.

హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రింగు రోడ్డు వద్ద చౌరస్తాను ఏర్పాటు చేసి.. బీరప్ప చౌరస్తా నామకరణం చేసేందుకు కౌన్సిల్‌లో తీర్మానం చేస్తామని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని యశోధ నగర్ పార్కులో దొడ్డి కొమరయ్య విగ్రహా పునరుద్దరణకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామని తెలిపారు. అంతకుమందు కురుమ సంఘం నాయకులు మాట్లాడుతూ ఎలాంటి మచ్చలేని పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎదగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థ సేవ చేయాలని అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం డివిజన్ అధ్యక్షులు నాగారం జగదీశ్వర్, గౌరవాధ్యక్షులు న్యాయవాది గోపాల్, ఉపాధ్యక్షులు పూజారి పాండు, కార్యదర్శి మల్లేశం, ఆయా మండలాల అధ్యక్షులు మరాఠి నరసింహులు, కురువ సతీష్, నవల్గ అంజిలప్ప, పెద్దేముల్ గోపాలకృష్ణ, పూజారి మల్లప్ప, వీర్‌శెట్టిపల్లి నర్సింహులు, పట్టణానికి చెందిన సంఘం సభ్యులు, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.


