ఇంటర్ సప్లిమెంటరీపై ప్రత్యేక దృష్టి

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఇంటర్ సప్లిమెంటరీపై ప్రత్యేక దృష్టి
– ప్రభుత్వ కాలేజీలో ఉత్తీర్ణత పెంపుకు చర్యలు
– అధిక అడ్మిషన్లను జరిగేలా ప్రణాళికలు
– ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ కాలజీలో ఇంటర్ సప్లిమెంటరీపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్ సూచించారు. మంగళవారం ఇంటర్మీడియట్ కమీషన్ ఆదేశాల మరకు తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంచార్జ్ ప్రిన్సిపల్ మల్లినాథప్ప ఆధ్వర్యంలో సమీక్షీ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈసమావేశానికి హాజరైన నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ కాలేజీలో ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీలో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆన్ లైన్, ఆఫ్ లైన్, వాట్సాఫ్ గ్రూపుల ద్వారా సలహాలు, సూచనలు అందించి చక్కగా చదివే విధంగా చూడాలన్నారు. సప్లిమెంటరీలో మంచి ఉత్తీర్ణత సాధించేలా చూడాలన్నారు. తాండూరు కాలేజీలో ప్రథమ సంవత్సరంలో 55శాతం, రెండో సంవత్సరంలో 73శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇంచార్జ్ ప్రిన్సిపల్, అధ్యాపకులను అభినందించారు. అదేవిధంగా విద్యా సంవత్సరంలో కాలేజీలోని ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఐసీ అన్ని గ్రూపులతో పాటు ఒకేషనల్ గ్రూపులలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో అధిక సంఖ్యలో అడ్మిషన్లు జరిగేలా శ్రద్ద చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అద్యాపకులు, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

భూవివాదంలో ఉద్రిక్తత..!