పరిశుభ్రత అందరి బాధ్యత
– తాండూరు మున్సిపల్ అధికారుల ప్రతిజ్ఞ
తాండూరు, దర్శిని ప్రతినిధి : పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని తాండూరు మున్సిపల్ అధికారులు అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని 12 వార్డులో జిమ్ పార్క్ వద్ద క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పరిసరాలను అందరు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పట్టణాన్ని సుందరంగా ఉంచడంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, శానిటరీ ఇనుస్పెక్టర్లు ఉమేష్, వెంకటయ్య, టౌన్ ప్లానింగ్, వార్డు ఆఫీసర్లు, పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


