తాండూరు అభివృద్ధికి పైలెట్ సరైనోడు
– ఎన్నికల్లో రోహిత్ రెడ్డిని గెలిపించండి
– అంతారంలో ప్రచారం చేసిన ఆర్తి రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు అభివృద్ధికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డే సరైనోడు అని ఆయన సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తాండూరు మండలం అంతారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తరుపున ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి పాల్గొని ఇంటింటి ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ మెనిఫెస్టోతో పాటు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సాధించిన ప్రగతి కరపత్రాలను పంచి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు.
తాండూరు అభివృద్ధికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సరైనోడు అని అభివర్ణించారు. ఎన్నికల్లో తన భర్తను ఆశీర్వదించి రెండో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపాలని కోరారు. కారుగుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ వీణ శ్రీనివాస్ చారి, గ్రామ సర్పంచ్ రాములు, ఎంపీటీసీ శాంతు, తాండూరు పట్టణ మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ, పట్టణ అధ్యక్షురాలు సంగీత ఠాకూర్, గ్రామ అధ్యక్షులు ప్రకాష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

