పుర పోరు.. ఫుల్ జోష్..!
– తాండూరులో 11 నామినేషన్లు దాఖలు
– ఉత్సహాంగా తరలివచ్చిన అభ్యర్థులు, నేతలు
– ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పుర పోరులో ఫుల్ జోష్ కనిపించింది. ఎన్నికల నోటికేషన్ లో భాగంగా బుధవారం నుంచే తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల దాఖల పర్వం ఉత్సహాంగా ప్రారంభమయ్యింది. బుధవారం తొలి రోజు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు కౌన్సిలర్ స్థానాల కోసం నామినేషన్లను దాఖలు చేసుకున్నారు.

నామినేషన్లు వేసే అభ్యర్థుల కోసం అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ కోసం కార్యాలయంలో 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కొ కౌంటర్ వద్ద 3 వార్డులకు సంబంధించి నామినేషన్లను స్వీకరించారు. అదేవిధంగా నామినేషన్లు వేసే అభ్యర్థులకు ఉన్న అపోహలు, అనుమానాలను తీర్చడంతో పాటు నామినేషన్ల పత్రాలను పంపిణీ చేసేందుకు ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశారు. పోటీ చేసే అభ్యర్థులు పత్రాలను స్వీకరించారు.

ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు పన్నులు క్లీయర్ ఉండాలని, నో డిప్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలని నిబంధనలు ఉండడంతో అధికారులు ఆస్తి పన్నులు, కుళాయి పన్నుల స్వీకరణకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. నో డిప్ సర్టిఫికెట్ల మంజూరు కోసం కూడా విభాగం ఏర్పాటు చేశారు. తాండూరు మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యింది. ఉదయం 10-30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 11 నామినేషన్లను దాఖలు చేసుకున్నారు.

మరోవైపు తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను తాండూరు తహసీల్దార్ తారాసింగ్ పరిశీలించారు. అదేవిధంగా తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య పట్టణ సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐ అంబార్యలతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. కార్యాలయం వద్ద ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు.
నామినేషన్లు వేసింది వీళ్లే…
వార్డు 1 దనసిరి నాగలక్ష్మి (BRS)
వార్డు 8 తలారి సాయప్ప (INC)
వార్డు 10 P. నర్సింలు (BRS)
వార్డు 14 మ్యాతారి హిందూ సురేష్ (INC)
వార్డు 15 బొబ్బిలి శోభారాణి(BRS)
వార్డు 16 నారశ్రీలత(INC)
వార్డు 20 బిర్కట్ జ్యోతి రఘు (INC)
వార్డు 23 గడ్డల పరిమళ(BRS)
వార్డు 24 పోలీస్ బాలకృష్ణ రెడ్డి (INC)
వార్డు 28 నాగారం మల్లేశం (BJP)
వార్డు 30 మహమ్మద్ సాబియా ఫాతిమా (BRS).

ఇదికూడా చదవండి…

