రైతులకు శుభవార్త..!
– భరోసా తొలి విడతకు ముహుర్తం ఖరారు
– నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రేవంత్ సర్కారు శుభవార్త చెప్పింది. రైతు భరోసా కింద రైతుల ఖాతాలో నిధుల విడుదలకు పచ్చజెండా ఊపింది.

నిధులు మంజూరు చేసే తేదిని కూడా నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను ఈ నెల 22న విడుదల చేయాలని నిర్ణయించింది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు.

ఒక ఎకరం వరకు ఉన్న రైతులకు మొదటి విడతలో సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,590 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. నిధులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడత విడుదలైన 20 రోజుల తర్వాత రెండో విడత.. ఏప్రిల్ నెలాఖరులోగా మూడో విడత నిధులను కూడా విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది.


