వెల్లివిరిసిన మతసామరస్యం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వెల్లివిరిసిన మతసామరస్యం..!
– ఘనంగా పైలెట్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
– పాల్గొన్న రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి
– పెద్ద సంఖ్య‌లో హాజ‌రైన ముస్లీంలు, మ‌త పెద్ద‌లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మత సామరస్యత వెల్లివిరిసింది. పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది.

ఆదివారం తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సీనియర్ నాయకులు పైలెట్ రోహిత్ రెడ్డి తండ్రి పంజుగుల విఠల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, పార్టీ నాయకులు, ముస్లిం, మైనార్టీ సోదరులు హాజరయ్యారు. ఇఫ్తార్ ప్రార్ధ‌న‌ల అనంత‌రం విఠల్ రెడ్డి, నేతలు ముస్లిం మ‌త పెద్ద‌లకు ఖ‌ర్జూరం, పండ్లు తినిపించి ఉపవాస దీక్షలను విరమింప జేశారు. అనంతరం విందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యతను కూడా చాటుతుంద‌ని అన్నారు. అంద‌రికి ముందస్తుగా రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇఫ్తార్ విందులో నేతలు, మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున తరలిరావడంతో మత సామరస్యత వెల్లివిరిసింది. ఈ కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ విఠల్ నాయక్, వెంకట్ రెడ్డి, బషారత్, సర్పంచ్ పాండురంగా రెడ్డి, మధుసూదన్ రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఓటర్లు మ్యాపింగ్ చేయించుకోవాలి